26 April, 2026 | 2:22 AM

సమాచార హక్కు చట్టంతో అవినీతిని నిర్మూలించాలి

26-04-2026 12:00 AM

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ

ముషీరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ప్రభుత్వంలో అవినీతిని ఎదుర్కోవడానికి ప్రజలను ప్రోత్సహించడమే సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ముఖ్య ఉద్దేశమని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ డా.చంటి ముదిరాజ్ అన్నారు.

సాధన కమిటీ జాతీయ సహాయ కార్యదర్శి మార్క నవీన్ కుమార్, జాతీయ కార్యదర్శి తోట శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా డా.చంటి ముదిరాజ్ హాజరై మాట్లాడారు. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ అనేది సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడానికి, పౌరులకు సమాచారాన్ని పొం దే హక్కును ఉపయోగించడంలో సహాయపడటానికి ఏర్పడిన కమిటీ అన్నారు.

ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, సమర్ధవంతంగా అమలు చేయడానికి, ప్రభుత్వంతో కలిసి కమిటీ పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా మార్క నవీన్ కుమార్ ను జాతీయ సహాయ కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, రాష్ట్ర నేతలు కాశీ సతీష్ కుమార్, ప్రకాష్ పటేల్, కడమంచి అజయ్ కుమార్, శివ కుమార్, అరవింద్ స్వామి, అధ్యక్షులు భోగం విష్ణు, దీపక్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.