8 June, 2026 | 12:31 PM

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన దుద్దిళ్ళ శ్రీనుబాబు

08-06-2026 11:17 AM

బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు

మంథని, పలిమెల,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పలిమెల మండల కేంద్రానికి చెందిన మండల రిపోర్టర్ బాడిష మధు తండ్రి  ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న  టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు ఆదివారం పలిమెల గ్రామంలోని మృతుని నివాసానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా మధు కుటుంబ సభ్యులను పరామర్శించిన శ్రీను బాబు, వారిని ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మధు తండ్రి మృతి కుటుంబానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. మృతుని కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ  కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.