27 July, 2026 | 5:22 PM

ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి

27-07-2026 04:50 PM

ముకరంపుర,జూలై27(విజయక్రాంతి): భారతరత్న, మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతి కార్యక్రమం ప్రజా ప్రయోజనాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అమీర్ ఆధ్వర్యంలో కరీంనగర్, అంబేద్కర్ నగర్ లో వారి విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా  మహమ్మద్ ఆమీర్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం  DRDO, ISRO సంస్థలో సేవలు అందించి, శాస్త్రవేత్తగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా యువతకు ఆదర్శంగా నిలిచారని రాష్ట్రపతి పదవిలో పీపుల్స్ ప్రెసిడెంట్ గా అందరి మన్ననలు పొందారని,నేటి యువత, విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల శ్యామల - కిరణ్ కుమార్, పిల్లి లక్ష్మణ్,అబ్దుల్ రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.