గడ్డం వంశీని గెలిపించాలి
మంత్రి శ్రీధర్‌బాబు ఆశీస్సులతోనే మీ ముందుకు
కాంగ్రెస్ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు
మంథని, మే 3 (విజయక్రాంతి): పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు కోరారు. మంథని పట్టణంలోని బోయిన్ పేటలో గడ్డం సరోజన వివేక్‌తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదు గ్యారెంటీలు అమలు అవుతాయని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు ఆశీస్సులతో వంశీకృష్ణ మీ ముందుకు వస్తున్నాడని, ప్రజలందరి ఆశీర్వాదం వంశీ కృష్ణపై ఉండాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ రమాదేవి, ఎంపీపీ కొండ శంకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




