బుదేరాలో చలి వేంద్రం ప్రారంభం
29-03-2026 04:26 PM
మునిపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని బుదేరా గ్రామ దివంగత మాజీ సర్పంచ్ కోల్కుంద దానయ్య జ్ఞాపకార్థంగా తన కుమారుడు గ్రామ సర్పంచ్ కోల్కుంద మల్లేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, మాజీ ఎంపీపీ రాంరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎండాకాలంలో ప్రజల దాహాని తీర్చేందుకు చలి వేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే బుదేరా చౌరస్తా ముంబాయి జాతీయ రహదారిపై ఉండడంతో ప్రయాణం చేసేందుకు వచ్చే ప్రయాణికులు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.




