15 April, 2026 | 12:01 AM

19వ తేది నుండి దుర్గాభవానీ ఆలయ వార్షికోత్సవం

14-04-2026 07:33 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్‌ రూరల్ మండలం నగునూర్‌లోని శ్రీదుర్గాభవానీ ఆలయ వార్షికోత్సవం ఈనెల 19 నుండి 21 వరకు జరుగుతాయని ఆలయ ఫౌండర్‌ చైర్మెన్‌ వంగళ లక్ష్మన్‌ తెలిపారు. వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం  గురు ప్రార్ధన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్ధాపన, గణపతి హోమం, సాయంత్రం 7 గంటలకు రాజోపచార పూజ, 20 సోమవారం ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం, 7 గంటల నుండి 9 గంటల వరకు జగత్ప్రసూతికాలంకరణ(పసుపుతో అలంకరణ), 10 గంటలకు చండీహోమం, సుబ్రహ్మణ్య హోమం, 11 గంటలకు సౌందర్యలహరి, శివానందలహరి పారాయణం,

మధ్యాహ్నం 12గంటలకు మహా హారతి, సాయంత్రం 7 గంటలకు శ్రీ సుందరేశ్వర స్వామి వారి ఎదురుకోళ్ళు, 21 మంగళవారం జగద్గురు శంకరాచార్య జయంతి పురస్కరించుకుని ఉదయం 7గంటలకు శంకరాచార్యులకు విశేష అభిషేకం, విశేష హారతి, నీరాజనం, స్తోత్ర పారాయణం, 10.30 నిమిషాలకు రుద్ర హోమం, మహా పూర్ణాహుతి, 11 గంటలకు శ్రీ దుర్గాభవానీ సుందరేశ్వరుల కల్యాణం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందాలని ఆయన కోరారు.