6 July, 2026 | 6:02 PM

గురుకులంలోకి అనాథ బాలిక దుర్గ

31-08-2024 03:07 AM

చేర్పించిన కలెక్టర్

నిర్మల్, ఆగస్టు 30 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్‌తరోడ గ్రామానికి చెందిన అనాథ బాలిక దుర్గను శుక్రవారం కలెక్టర్ అభిలాష అభినవ్ గురుకుల పాఠాశాలలో చేర్పించారు. ఇటీవలే దుర్గ త ల్లి గంగామణి చనిపోవడంతో బాలిక దుర్గ ఒంటరిదై పోయింది. ప్రసార మాధ్యమాల్లో బాలిక దీనస్థితిపై వచ్చిన సమాచారంతో పలువురు అండగా నిలిచారు. ఆమె చదువ కోవడానికి కలెక్టర్  చేయూత అందించి, గురుకులంలో చేర్పించారు.