18 April, 2026 | 1:04 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

థాయిలాండ్ లో రామగుండం ఎమ్మేల్యే మక్కాన్ సింగ్ కుటుంబ సభ్యులకు భూకంప తాకిడి

29-03-2025 01:08 AM

తృటిలో తప్పించుకున్న నలుగురు కుటుంబ సభ్యులు

రామగుండం,(విజయక్రాంతి): థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ లో ఓ ఫంక్షన్ కు హజరు కావటానికి వెళ్లిన రామగుండం ఎమ్మేల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలీ ఠాకూర్  కూతురు, చిన్న కుమారుడు, ఆల్లుడు గురువారం వెళ్ళారు. వీరు ఓ హోటాల్ లో 35 వ ఆంతస్తులో బస చేయగా దూరదృష్టవశాత్తు శుక్రవారం మద్యాహ్నం అకస్మాత్తుగా భారీ భూ కంపం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున బిల్డింగ్ లు కుప్పకూలాయి. ఐతే వీరు బస చేసిన హోటేల్ బిల్డింగ్ కు మాత్రం పాక్షికంగా భూకంప తాకిడి తాకింది. ఎమ్మేల్యే మక్కాన్ సింగ్ కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రమాధం జరుగక పోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే వారు ఇండియాకు తిరుగు ప్రయాణం అయ్యారు. హైదరాబాదు నుంచి రామగుండం వస్తున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఈ విషయం తెలుసుకొని హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు.