17 March, 2026 | 6:48 AM

మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు

07-11-2024 04:48 PM

హైదరాబాద్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లా రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. గతేడాది జూన్‌లో మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. పలు డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సోదాల్లో మల్లారెడ్డి కాలేజీల్లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈడీ నోటీసుల్లో ఏం పేర్కొంది? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.