8 July, 2026 | 9:44 PM

రెబ్బెనలో సోలార్ మోటార్ పంపులను ప్రారంభించిన గోడం నగేష్

08-07-2026 09:10 PM

ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ 

 బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని రెబ్బెన గ్రామంలో ఆదివాసి రైతు మండిగ రాములు చేనులో ఏర్పాటు చేసిన సోలార్ మోటర్ పంపును స్విచ్ ఆన్ చేసి ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెబ్బెన గ్రామంలో 5గురు ఆదివాసి రైతులకు పైలెట్ ప్రాజెక్టు కింద సోలార్ మోటార్ పంపులు బిగించడం జరిగిందని,  తద్వారా వారికి రెండు పంటలు పండించుకునే అవకాశం చిక్కిందని తెలియజేశారు.

త్వరలో ఇందిర గిరి జల వికాసం పథకం కింద గిరిజనులకు వారి చేలల్లో సోలార్ వాటర్ పంపులను ఏర్పాటు చేయనున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,సర్పంచ్ నందిపేట రాజం, ఉప సర్పంచ్ గువ్వల పోషం, రైతులు సుంకే లాస్మయ్యా, నాయిని అంజయ్య, మందిగ శంకరి, నాయిని పుల్లయ్య, నాయకులు ఎడ్ల శంకరి, పులబోయిన వెంకటేష్, కారెం సతీష్ తదితరులు పాల్గొన్నారు.