8 July, 2026 | 9:33 PM

కోనరావుపేటలో వైఎస్సార్ జయంతి

08-07-2026 09:01 PM

ఘనంగా రైతు భరోసా సంబరాలు

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో బుధవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మానుక సత్యం ఆధ్వర్యంలో రైతు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు, ముఖ్యంగా రైతులు మరియు పేదల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడిగా వైఎస్సార్ చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.రైతులకు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేయడం అభినందనీయమని, వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషి చేస్తున్నారని కొనియాడారు.రైతు భరోసా నిధులు జమ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.