విద్యతోనే భవిష్యత్తు
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యతోనే మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని ఎంజెపి బాలికల పాఠశాల ప్రిన్సిపల్ సుకన్య(MJP Girls School Principal Sukanya) అన్నారు. పదవ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన లిఖిత, ఐశ్వర్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ... పదవ తరగతిలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను పూర్తిగా తీసుకొని ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు విద్యను అభ్యసించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వసతులను విద్యార్థినిలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రత్యేక ప్రణాళికతో పాఠశాలలో విద్యను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయురాలు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






