విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరవచ్చు
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్, మార్చి 9 (విజయక్రాంతి): విద్యార్థులకు త్వరగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏటీసీ నైపుణ్యత ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని లక్కారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏటీసీ విద్యార్థులతో ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. పాఠశాలలో నూతనంగా కొత్త కోర్సులను ప్రారంభించారు. విద్యార్థులు చేసిన అసైన్మెంట్ను తిలకించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏటీసీ ద్వారా స్కిల్స్ నేర్చుకోవడం, స్కిల్స్‌ని పూర్తి చేస్తేనే ఉపాధి అవకాశాలు వస్తాయని గుర్తు చేశారు. పాఠశాలలో పదో తరగతి చదివే విద్యార్థులకు పరీక్ష పేర్లు పెన్సిల్, పెన్నులు పంపిణీ చేశారు. పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు భయాన్ని వీడి పరీక్షలు రాయాలని సూచనలు చేయడంతో పాటు విద్యార్థుల కు శుభాకాంక్షలు తెలిపారు. 9.5 గ్రేడ్ దాటిన వారికి రూ. 2,500, మండల టాపరులకు రూ. 5,000, జిల్లా టాపర్లకు రూ. 10 వేలు బహుమతిగా ఇస్తానని విద్యార్థులను ప్రోత్సహించారు. ఆయనతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




