10 March, 2026 | 8:38 AM

నిర్మల్‌లో ఈద్గా ఏర్పాటుకు కృషి

10-03-2026 12:51 AM

నిర్మల్, మార్చి 9 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో మైనార్టీలకు తో ఈద్గా, మైనార్టీ గురుకులాల్లో సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలంగాణ మైనార్టీ గురుకులాల వైస్ చైర్మన్ ఫహీమ ఖురేషి హామీ ఇచ్చారు. సోమవారం నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆప్పాల గణేష్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ అర్జుమాంద్ అలీ హైదరాబాద్‌లో కలిశారు.

నిర్మల్ పట్టణంలో ఈద్గా ఏర్పాటు, నిర్మల్‌లోని మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యూకేషన్ ఇన్స్‌ట్యూట్‌లో సౌకర్యాల మెరుగు పరచాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు వారు తెలిపారు. నిర్మల్ పట్ట ణ అభివృద్ధిపై ముఖ్యమంత్రితో మాట్లాడి సహకరించాలని కోరారు.