బాన్సువాడలో అమర ప్రసాద్ దిష్టిబొమ్మ దగ్ధం...

16-09-2026 | 07:32pm

బాన్సువాడ, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కించపరిచిన అమర ప్రసాద్(Amara Prasad) వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం(All India Ambedkar Association), ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం అమర ప్రసాద్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షులు దేశాయిపేట ప్రశాంత్ మాట్లాడుతూ అంబేద్కర్ కల్పిత నాయకుడు అంటూ బుక్కు రాసి దాన్ని 18వ తారీఖున రిలీజ్ చేస్తానని చెప్పిన తరుణంలో భారతదేశ వ్యాప్తంగా ఆ బుక్కు రిలీజ్ చేస్తే అనేకమంది ప్రజల మనోభావాలు దెబ్బతిని కుల మతాలు విద్వేషాలకు లోన అయ్యే పరిస్థితి ఉంది అన్ని రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటన చోటుచేసుకునే అవకాశం ఉంది.

కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీఎం రేవంత్ రెడ్డి, భారత ప్రధాని నరేంద్ర మోడీ అమర ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో  పట్టణ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నక్క విజయ్,డివిజన్ అధ్యక్షులు దేశాయ్ పేట్ ప్రశాంత్, కౌన్సిలర్ దొన కంటి వెంకటేష్, దళిత సంఘాల రాష్ట్ర నాయకులు బంగారు సాయిలు, కాదెపురం గంగారాం, బంగారు మైసయ్య సంధుల గంగారం రవీందర్ మన్నే చిన్న సాయిలు, జిల్లా నాయకులు రుశేగం భూమయ్య,బండి విజయ్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు