03-02-2026 08:56:01 PM
సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణంలోని వివిధ చౌరస్తాలలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఎనిమిది మందికి రూ.81,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఒకరికి రూ.5వేలు ఫైన్ విధించారని పేర్కొన్నారు.
టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో...
అదేవిధంగా సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ముగ్గురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు. వారిని మంగళవారం సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరుచగా రూ.31,500 జరిమానా విధించారని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఒకరికి రూ.5000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని పేర్కొన్నారు.