గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు
ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్ష
నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
నిమజ్జన ప్రదేశాల్లో గజఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు, వైద్య, సిబ్బంది సిద్ధం
సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలు నిర్వహిం చాలి
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలను నిర్వహిoచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్(District Collector Ashish Sangwan), ఎస్పీ రాజేష్ చంద్రలు అన్నారు. బుధవారం కామారెడ్డి పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జన రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ముందుగా ట్రాఫిక్ గణపతిని దర్శించుకున్న అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులు, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు రాజు, శ్రీనివాస్, ఆర్గనైజర్లతో కలిసి ప్రత్యేక బస్సులో నిమజ్జన రూట్‌ను స్వయంగా పరిశీలించారు.
కామారెడ్డి ఓల్డ్ బస్టాండ్ – ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ముఖ్య ప్రాంతాల గుండా బాంబే క్లాత్, పాన్ చౌ రస్తా, బడా మసీద్, రైల్వే ఫ్లైఓవర్, నిజాంసాగర్ చౌరస్తా, న్యూ బస్టాండ్ మీదిగా నిమజ్జన మార్గాన్ని పరిశీలిస్తూ, నిమజ్జన ముగింపు ప్రదేశమైన అడ్లూరు ఎల్లారెడ్డి పెద్దచెరువు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి వరకు రూట్‌లోని అన్నీ ప్రాంతాలను సందర్శించారు.
ఈ సందర్భంగా నిరూట్‌లో గుర్తించిన సమస్యలను నిమజ్జన కార్యక్రమానికి ముందే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ లు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పి రాజేష్ చంద్ర లు మాట్లాడుతూ, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్‌హెచ్‌ఓ బి. నరహరి, కామారెడ్డి ఆర్డీఓ గిరిధర్, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, తదితర శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితుల ప్రతినిధులు, పాల్గొన్నారు.