30 July, 2026 | 2:49 PM

కోయగూడెం యాదవ సంఘానికి కుల పెద్దల ఎన్నిక

30-07-2026 02:00 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామంలో యాదవ సంఘానికి కుల పెద్దలను గ్రామ పెద్దలు, సంఘ సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కుల పెద్ద గొల్లగా పెరుగు సత్యనారాయణ, కుల సారగొల్లగా ఎర్రగడ్డ గురవయ్య ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కుల పెద్దలకు గ్రామ యాదవ సంఘ సభ్యులు అభినందనలు తెలియజేస్తూ, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యాదవ సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.