30 July, 2026 | 3:25 PM

నేను విద్యాశాఖకు ఎందుకు రాజీనామా చేయాలి?

30-07-2026 02:47 PM

విమర్శలు గుర్తుచేసుకుంటే మనుగడ సాధించలేమ్

2034 వరకు సీఎంగా నేనే ఉంటా

హైదరాబాద్: హైదరాబాద్‌లోని MCRHRD ప్రాంగణంలోని దాశరథి ఆడిటోరియంలో, ఫిన్‌లాండ్, జర్మనీ ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ... 2014 నుంచి ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) రూ. 151 లక్షల కోట్లు అప్పులు చేశారని లెక్క చెప్పారు. గత ప్రధానులు స్వాతంత్య్రం నుంచి 2014 వరకు రూ. 51 లక్షల కోట్ల అప్పులు చేశారని వివరించారు. విమర్శలు గుర్తుచేసుకుంటూ ఉంటే మనం మనుగడ సాధించలేమని రేవంత్(Revanth Reddy ) స్పష్టం చేశారు. విమర్శలు చేసినవారు చూస్తూనే ఉంటారు.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి సూచించారు. వెనుకబాటుతనానికి కారణం.. చదువుకోకపోవడమే అన్నారు. విద్యాశాఖలో కేకే అనేక సూచనలు చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వ ఆదాయం పెంచి ప్రజలకు పంచాలనేదే తమ సర్కార్ లక్ష్యమన్నారు. విద్యలో నాణ్యత పెరగాలన్న సీఎం పిల్లలకు పౌష్ఠికాహారం అందించాలన్నారు.

నేను విద్యాశాఖకు ఎందుకు రాజీనామా చేయాలి?

తన దగ్గరనున్న విద్యాశాఖ నుంచి ఎందుకు రాజీనామా చేయాలి?, పిల్లలకు అల్పాహారం అందించినందుకు రాజీనామా చేయాలా?, ఐటీఐలను కాకుండా ఏటీసీలు ఏర్పాటు చేసినందుకు రాజీనామా చేయాలా? అని సీఎం ప్రశ్నించారు. అడగకుండానే ఉపాధ్యాయుల సమస్యల బాధ్యత తానే తీసుకుంటానన్న రేవంత్ రెడ్డి, పిల్లల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలు తనతో కొట్లాడాలని సూచించారు.

2034 వరకు సీఎంగా నేనే ఉంటా

ఐఏఎస్ ను బదిలీ చేయడం తేలిక.. టీచర్ ను బదిలీ చేయడం అంత తేలికా?, దేశానికి విద్య, వైద్యంతో నాయకత్వాన్ని తెలంగాణ నుంచి ఎందుకు ఇవ్వలేము? అన్నారు. తాను గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నానని సీఎం రేవంత్పునర్ఘటించారు. గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుని ఏమవుతావని అడిగారు.. సీఎం అవుతా అని చెప్పా అన్నారు. 2034 వరకు సీఎంగా నేనే ఉంటానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జనవరి 2024 ముందు ఏనాడైన ఒకటో తేదీన మీ ఖాతాలో జీతాలు పడ్డాయా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు ఒకటో తేదీన ఇవ్వకపోతే ప్రభుత్వం విఫలమైనట్లేనని వ్యాఖ్యానించారు..

పైనుంచి కాదు.. కింద నుంచి ఆదేశాలు రావాలి

చిన్నప్పుడు పిల్లలను హాస్టల్ లో వేస్తున్నాం.. పెద్దయ్యాక తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేస్తున్నారని సూచించారు. విద్యపై ఖర్చు పెట్టడానికి తనకు ఇబ్బంది లేదని సీఎం వెల్లడించారు. పిల్లలకు , విద్య కోసం ఏం కావాలో తనను అడగాలని, ఎలాగైనా తెచ్చి ఇస్తానని హామీ ఇచ్చారు. మీ మండలంలో ఉన్న ప్రతి పిల్లవాడు ప్రభుత్వం పాఠశాలకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. మీ మండలానికి ఏం కావాలో ఉపాధ్యాయులు చెప్పాలని కోరారు. పై నుంచి కాదు.. కింద నుంచి ఆదేశాలు రావాలని తెలిపారు. మండలాల్లో విద్యాభివృద్ధికి ఏం కావాలో ఉపాధ్యాయులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. టీచర్ల సలహాలను తీసుకుని అధికారులు అమలు చేస్తారని స్పష్టం చేశారు. గవర్నమెంట్ కాలేజీలో చదివితే ఉద్యోగం వస్తుందనే నమ్మకం విద్యార్థులకు కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు.