పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం
15-06-2026 06:10 PM
మండల అధ్యక్షుడు మానుక సత్యం
కోనరావుపేట,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీని పల్లెల స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు గ్రామ కమిటీల ఏర్పాటును చేపడుతున్నట్లు కోనరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మానుక సత్యం తెలిపారు. సోమవారం మండలంలోని శివంగళపల్లి గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే ఉత్సాహవంతులైన ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయించే గ్రామ శాఖ అధ్యక్షుని నాయకత్వంలో అందరూ సమన్వయంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.






