ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి
సదాశివనగర్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ప్రిన్సిపాల్ సింగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని వివిధ గ్రామాలలో పదవ తరగతి పాసైన విద్యార్థినీ, విద్యార్థులను కలిసి అడ్మిషన్ల ప్రచారం నిర్వహించారు.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత నాణ్యమైన విద్య అందిస్తున్నామని, ఉచిత పాఠ్యపుస్తకాలు, IFP , IDP ప్యానెల్స్ ద్వారా JEE మెయిన్స్, నీట్, క్లాట్ వంటి పోటీ పరీక్షలకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని, ప్రతి విద్యార్థిని విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ వహిస్తున్నామని, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, ఉదయం సాయంత్రం వేళలో స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నామని,
ఈ విద్యా సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, యూనిఫార్మ్స్, నోటు పుస్తకాలు అందిస్తుందని ప్రిన్సిపాల్ సింగం శ్రీనివాస్ తెలిపారు, అడ్మిషన్ల ప్రచారంలో భాగంగా ఈరోజు సదాశివ నగర్ మండల కేంద్రంలో, అడ్లూరు ఎల్లారెడ్డి,మర్కల్ గ్రామాలలో కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపల్ అడ్మిషన్ల ప్రచారo నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత నాణ్యమైన విద్య మరియు అనేక సౌకర్యాలను మండలం మరియు పరిసర గ్రామ పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు.అలాగే ఇటీవల ప్రకటించిన అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలలో 96.5% ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే రెండవ స్థానంలో నిలిచిందని ప్రిన్సిపాల్ సింగం శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం సభ్యులు ఉన్నారు..






