రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే విద్యుత్ శాఖ లక్ష్యం: ఏఈ శ్రీనివాస్
22-07-2026 04:33 PM
రుద్రంగి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలోని దోనబండ ఏరియాలోని రైతులకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం SS 336 100 KVA నూతన DTRను విజయవంతంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఈ శ్రీనివాస్ మాట్లాడుతూ,పొలాల్లో విద్యుత్ వాడకం విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. షాక్ ప్రమాదాల నుండి రక్షణ పొందేందుకు ఇనుప స్టార్టర్ డబ్బాల స్థానంలో సురక్షితమైన ప్లాస్టిక్ స్టార్టర్ డబ్బాలను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రైతుల సమస్యలను అర్థం చేసుకుని త్వరితగతిన ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేసి అందుబాటులోకి తెచ్చిన విద్యుత్ శాఖ అధికారులకు,సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.






