22 July, 2026 | 5:12 PM

సింగరేణి డిస్పెన్సరీలో డాక్టర్, సిబ్బంది కొరత

22-07-2026 04:37 PM

సీఎంఓకు వినతి పత్రం అందజేసిన ఎండి రజాక్

కొత్తగూడెం,విజయక్రాంతి): రామవరం డిస్పెన్సరీ నందు డాక్టర్, సిబ్బందిని ఏర్పాటు చేయాలని కార్పొరేట్ ప్రధాన ఆసుపత్రి  చీఫ్ మెడికల్ ఆఫీసర్, కిరణ్ రాజ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ అనంతరం మాట్లాడుతూ... డిస్పెన్సరీ నందు  ప్రస్తుతం నర్స్ ఒకరు మాత్రమే ఉన్నారని, డాక్టర్ తో పాటు సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు.

రామవరం నందు రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులు, డిఎల్ఆర్ కార్మికులు, కార్మికుల కుటుంబ సభ్యులు ఎక్కువ ఉన్నందున, వారికి జ్వరం వచ్చిన ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, మెయిన్ హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తుంది. డాక్టర్ సేవలు ఉద్యోగులకు అత్యవసరమని, డాక్టర్ మరియు సిబ్బందిని ఏర్పాటు చేస్తే, కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రికి వెళ్లే అవసరం లేకుండా రామవరం డిస్పెన్సరీలోనే వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుందని అదే విధంగా ఉద్యోగులు కూడా సమయం ఆదావుతుందని, విధులకు గైర్హాజరు కాకుండా వైద్య సేవలు వినియోగించుకోవచ్చని, ముఖ్యంగా బీపీ, షుగర్, టాబ్లెట్ల తోపాటు కుటుంబ సభ్యులకు కూడా ట్రీట్మెంట్ చేయించుకునే వీలు కలుగుతుందని, ఐఎన్టియుసి యూనియన్ ద్వారా సి ఎం ఓ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిఎంఓ, సానుకూలంగా స్పందించి, ఉన్నతాధికారుల దృష్టికి  తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.