calender_icon.png 4 June, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబరాన్నంటిన ఆవిర్భావ వేడుకలు

02-06-2025 11:24:54 PM

పలుచోట్ల పాల్గొన్న ప్రముఖులు..

ఆవిర్భావ ఆకాంక్ష చాటిన వేడుకలు..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటేలా సాగాయి. జిల్లావ్యాప్తంగా ప్రముఖులు పాల్గొన్నారు. జెడ్పి కార్యాలయంలో ప్రత్యేక అధికారి హోదాలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) జెండా ఆవిష్కరించి అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్ పరిధిలో చేస్తున్న కార్యక్రమాలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో పాటు జిల్లా పరిషత్ సిబ్బంది లక్ష్మినారాయణ, తోటజి, పాల్గొన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి జాతీయ జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు అన్ని వసతులు కల్పించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సెక్రెటరీ, సిబ్బంది సతీదేవి, సలీం పాఠకులు పాల్గొన్నారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికార పార్టీ చేస్తున్న పలు సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్, పార్టీ మండల అధ్యక్షుడు చరణ్, జిల్లా నాయకులు అబ్దుల్లా, శైలేందర్, అసద్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని డిపిఓ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు జాతీయ జెండా ఆవిష్కరించారు.

తెలంగాణ ఆవిర్భావ విధి విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి చిత్తరంజన్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఆ శాఖ జిల్లా అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కాగజ్ నగర్ లో కోనేరు కోనప్ప జెండా ఆవిష్కరించి అమరులను స్మరించుకున్నారు.ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర సాధనలో బిజెపి పాత్ర వివరించారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.