17 April, 2026 | 4:39 AM

కవిత.. బీజేపీ వదిలిన బాణం

03-06-2025 12:00 AM

పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ 

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కవిత లేడీ మాఫియా డాన్ అని, కవిత ముమ్మాటికి బీజేపీ వదిలిన బాణమేనని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కూడా భాగస్వామి అని, ఆ చర్చ లు ప్రగతిభవన్‌లోనే జరిగాయన్నారు. మధుయాష్కీ గౌడ్ సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.

కవిత అనేక స్కామ్‌లు చేసిందని, జీఎస్టీ, దొంగ నోట్ల స్కామ్‌లో భాగ స్వామ్యం ఉందని, జాగృతి ఒక అవినీతి సం స్థ అని, ఆ సంస్థపై విచారణ చేపట్టాలని మధుయాష్కీ డిమాండ్ చేశారు. రాజీవ్ ప్రతాప్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో కవిత రూ. 800 కోట్లు దోచుకుందని ఆరోపించారు. అవినీతి సొమ్మును కాపాడుకునేందుకే ప్రధాని మోదీ, అమిత్‌షా ఆదేశాల మేరకే కవిత పని చేస్తోందని తెలిపారు.