12-11-2025 12:00:00 AM
లెక్కలు తీస్తున్న అధికారులు
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగుల డేటాను అధికారులు మ్యాపింగ్ చేస్తున్నారు. మూడునాలుగు రోజులుగా అధికారులు ఈ పనిలోనే నిమగ్నమయ్యారు. ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు ఉద్యోగుల లెక్కలన్నీ తీస్తున్నారు. రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, మధ్యాహ్న భోజన కార్మికులు ఎంత మంది ఉన్నారో వివరాలు సమీకరిస్తున్నారు.
అయితే కొంత మంది మధ్యాహ్న భోజన కార్మికుల వివరాలు మ్యాచ్ కావడంలేదని అధికారుల దృష్టికి వచ్చినట్టు తెలిసింది. వీరి వివరాలను సేకరిస్తున్నారు. విద్యాశాఖకు సంబంధించిన పూర్తి వివరాలను వీలైనంత త్వరగా ఆర్థిక శాఖకు పంపించేందుకు డేటా మ్యాపింగ్ చేస్తున్నారు.