పికిల్‌బాల్ నేషనల్స్‌కు తెలంగాణ జట్టు ప్రకటన
హైదరాబాద్, నవంబర్ 11: తొలిసారి జర గనున్న జాతీయస్థాయి పికిల్‌బాల్ పోటీలకు తెలంగాణ పికిల్‌బాల్ అసోసియే షన్(టీపీఏ) 46 మందితో పటిష్టమైన జట్టును ప్రకటించిం ది. తెలంగాణ స్టేట్ నెంబర్ వన్ ప్లేయర్ సమీ ర్ వర్మ టీమ్ మెంటార్‌గా , సీనియర్ ప్లేయర్ శ్రీకర్ తెలంగాణ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిం చబోతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పికిల్‌బాల్ టీమ్ ధరించే జెర్సీని ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఆవిష్కరించారు.
జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ పికిల్‌బాల్ ప్లేయర్స్ చక్కని ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షించారు. గతకొంతకాలంగా పికిల్‌బా ల్‌కు పెరుగుతున్న క్రేజ్‌ను చూస్తే సంతోషంగా ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని టోర్నీలు నిర్వహిస్తామని తెలంగాణ పికిల్‌బాల్ అసోసి యేషన్ సెక్రటరీ, ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ విష్ణువర్థన్ చెప్పారు.కాగా జాతీయ పికిల్‌బాల్ పోటీలు నవంబర్ 13 నుంచి 16 వరకూ బెంగ ళూరులో జరగబోతున్నాయి.




