ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చిన్నలింగపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులకు శుభారంభం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్యాగ విజయ దేవేందర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ పనులు గ్రామాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామ ప్రజలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
గ్రామ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని పేర్కొన్నారు. పల్లెల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జక్కుల రవి, వార్డు సభ్యులు వంతడుపుల శంకర్, ఐలపురం చిరంజీవి, పిట్ల స్రవంతి, వంతడుపుల స్వామి, మాజీ ఎంపీటీసీ శ్యాగ దేవేందర్, ఉపాధి హామీ మేటి గుర్రం తిరుపతి, కూలీలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




