1 June, 2026 | 3:53 PM

Breaking News

జొన్నల తూకం కాంటా కోసం కొట్లాడుతున్న రైతులు   •   అందరికీ ఉద్యోగం ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదు: TGPSC చైర్మన్   •   వరి ధాన్యం సాగులో దేశంలో తెలంగాణ మొదటి స్థానం   •   తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్   •   తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల హామీలపై సీఎం స్పష్టత ఇవ్వాలి   •   గిరిజాయి గ్రామంలో అగ్ని ప్రమాదం రెండు లక్షల నగదు ఆరు లక్షల ఆస్తి నష్టం.   •   బీఎంఎస్ఆర్యు రాష్ట్ర అధ్యక్షుడిగా పప్పుల సురేష్   •   డీజేలకు అనుమతి లేదు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలి   •   NEET-UG రీ-ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు   •  

అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ

10-04-2026 04:12 PM

కారేపల్లి,(విజయక్రాంతి): అప్పాయిగూడెం జీపీలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా పోషణ పక్షం కార్యక్రమంను అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్పంచ్ దండు ప్రవీణ్ చిన్నారుల ఆరోగ్యం, విద్య, మరియు పోషణపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలను మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉంచాల్సిన అవసరాన్ని వివరించారు.

అలాగే చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం ద్వారా విద్యా ప్రాధాన్యతను తెలియజేశారు. పిల్లల సరైన పోషణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎట్టి సంధ్య రాణి, ఐసిడిఎస్ సూపర్వైజర్ జి. రాధమ్మ, అంగన్వాడీ టీచర్ బత్తుల రోజామణి పాల్గొన్నారు. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.