13 June, 2026 | 6:41 PM

Breaking News

గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రాథోడ్ ప్రకాష్   •   సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం   •   డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం   •   వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా కత్తుల లింగస్వామి   •   ఘనంగా బిఆర్ఎస్ నేత ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   పట్టణంలో కోతుల పట్టివేత   •   గోండి భాష నేర్చుకుంటా.. ఆదివాసీ గోండుల కట్టుబాట్లను ఆదర్శంగా తీసుకుంటా..   •   ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత శిబిరం   •   గాలికి కూలిన ఇంటికి చేయూత - 'మీకోసం మేమున్నాం టీం' ఆర్థిక సహాయం   •   అంగన్వాడీలే ముద్దు.. ప్రీ ప్రైమరీ స్కూళ్లు వద్దు..   •  

దేవరాంపల్లిలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో బైఠాయింపు

17-04-2025 07:58 PM

కాటారం (విజయక్రాంతి): మండలంలోని దేవరాం పల్లి గ్రామంలో మంచినీటికి ఇబ్బందులు పడుతున్నామని మహిళలు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. గత మూడు నెలల నుండి అష్ట కష్టాలు పడుతున్నప్పటికి తాగునీటి సౌకర్యం కల్పించలేకపోతున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి బిజెపి నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లా నారాయణరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని ప్రజల ఇక్కట్లను తీర్చడం లేదని మంత్రి తీరుపై ఆయన మండిపడ్డారు. సొంత మండలంలో అభివృద్ధి చేయని మంత్రి, రాష్ట్రాన్ని ఏమీ అభివృద్ధి చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు పాగే రంజిత్, మాజీ అధ్యక్షులు మల్లారెడ్డి, బొమ్మన భాస్కర్ రెడ్డి, దుర్గం తిరుపతి, శ్రీశైలం యాదవ్, స్వామి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.