నేతలకు పదవులు కట్.. మీనాక్షి నటరాజన్ ప్రకటన
10-08-2026 02:10 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ నేతలతో వరస జూమ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో మీనాక్షి నటరాజన్ సోమవారం జూమ్ సమావేశం(Meenakshi Natarajan Zoom meeting) నిర్వహించారు. సమావేశానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ హాజరయ్యారు. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పరిధిలో నేతలకు ఆమె కీలక సూచనలు చేశారు. సర్ ప్రక్రియ నేటితో ముగింపు దృష్ట్యా ఇప్పటివరకు జరిగిన ప్రక్రియపై మీనాక్షి సమీక్ష నిర్వహించారు. సర్ విషయంలో అలసత్వం వహించిన నేతలపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలసత్వం వహించిన నేతలకు పార్టీ పదవులు కట్ చేస్తామని ప్రకటించారు.






