10 August, 2026 | 3:34 PM

స్థానికుల్లో భయాందోళన.. పార్క్ చేసిన కారులో మంటలు

10-08-2026 02:31 PM

హైదరాబాద్: హయత్ నగర్‌లోని(Hayathnagar) శంకర్ నగర్ కాలనీలో సోమవారం ఒక కారులో మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటన జరిగినప్పుడు పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ కారు అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. చాలా కాలంగా వాడకపోవడంతో ఆ కారును పక్కన పెట్టినట్లు కారు యజమాని చెప్పారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారుకు మంటలు అంటుకున్నప్పుడు బాంబు పేలుడు లాంటి పెద్ద శబ్దం వచ్చిందని, ఏం జరుగుతుందో తెలియక తాము భయపడ్డామని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.