10 August, 2026 | 3:12 PM

ఎరాజుపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ నూతన చైర్మన్‌గా నర్సింహారెడ్డి

10-08-2026 02:12 PM

బోధన్,ఆగస్టు 10 (విజయక్రాంతి): ఎరాజుపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ నూతన చైర్మన్‌గా నర్సింహారెడ్డి ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలనే లక్ష్యంతో కమిటీని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామ అభివృద్ధి కమిటీ సమావేశంలో సభ్యులు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమాచారం. చైర్మన్‌గా నర్సింహారెడ్డితో పాటు పలువురు సభ్యులను కమిటీలోకి ఎంపిక చేశారు.

గ్రామంలోని తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, మౌలిక వసతులు తదితర అంశాలపై దృష్టి సారించి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ, గ్రామ ప్రజల సహకారంతో కమిటీని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామని, గ్రామ అభివృద్ధికి అందరినీ భాగస్వాములను చేస్తామని తెలిపారు. గ్రామ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఉపాధ్యక్షులు తెనుగు శ్రీనివాస్,సమాచారం కార్యకర్త శ్యామ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కుప్పర్యాల రామ్ చందర్, క్యాషియర్ నడిపి గంగారెడ్డి, కోమటి వెంకటి, రఘువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.