15 April, 2026 | 12:09 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఈఎన్సీ హరిరామ్ అరెస్టు

28-04-2025 02:27 AM
  1. 14 రోజుల పాటు రిమాండ్
  2. చంచల్‌గూడ జైలుకు తరలింపు
  3. సుమారు రూ.200 కోట్ల ఆస్తుల గుర్తింపు

హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్‌ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆదివారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు పంపించారు. సుమారు రూ.200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించిన ఏసీబీ.. ఈ కేసును మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది.

శనివారం తెల్లవారుజాము నుంచి టోలిచౌకిలోని హరిరామ్ లగ్జరీ విల్లాతో పాటు నివాసంలో 8 బృందాలుగా ఏర్పడి సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. 24 గంటల పాటు నిర్విరామంగా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగగా.. ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు సోదాలు ముగించి తెల్లవారుజామున 3 గంటలకు హరిరామ్‌ను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.

14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. అతడి నుంచి బీఎండబ్ల్యూ కారుతో సహా రెండు కార్లు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పలు ఆస్తుల పేపర్లు, బ్యాంకు డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ ప్రకటించింది.

ఆస్తుల విలువ మార్కెట్ విలువ కంటే పదిరెట్లు ఎక్కువగా ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా ఆయన భార్య అనిత కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనే డిఫ్యూటీ ఈఎన్సీగా పనిచేసింది. ఇప్పుడు వాలంతరీ సంస్థ డీజీగా పనిచేస్తున్నారు.  

ఏసీబీ గుర్తించిన ఆస్తులు

తెలంగాణతో పాటు ఏపీలోని అమరావతిలో కమర్షియల్ భవనం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 20 గుంటలు, శ్రీనగర్‌లో రెండు ఇండిపెండెంట్ ఇండ్లను గుర్తించారు.

వీటితో పాటు ఆరు ఎకరాల మామిడి తోట, ఒక ఫామ్ హౌస్, కొత్తగూడెం, కుత్బులాల్లపూర్, మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్లను గుర్తించారు. కొండాపూర్, షేక్‌పేట, మాదాపూర్, కోకాపేట, సంజీవరెడ్డి నగర్‌లో భారీ భవనాలు ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. సిద్దిపేట జిల్లా, మిర్యాలగూడలో ఫామ్‌హౌస్‌లు, మామిడి తోటలు భవనాలు గుర్తించారు.