జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

17-09-2026 | 09:03am

ఉధంపూర్జమ్ముకశ్మీర్‌లోని(Jammu and Kashmir) ఉధంపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ జరుగుతుండగా, భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య గురువారం ఎదురుకాల్పులు(Encounter) చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. అనుమానిత ఉగ్రవాదుల కదలికల సమాచారం మేరకు బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మజల్టాలోని మారుమూల ప్రాంతాలైన బ్రాటెల్ సోన్, ఖుబ్బన్‌లలో సైన్యం, పోలీసులు, సిఆర్‌పిఎఫ్ (CRPF) సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఆపరేషన్ ప్రారంభమైన కొద్దిసేపటికే అనుమానిత స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులిద్దరూ(Pakistan terrorists) హతమయ్యారు. డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులను సైన్యం గుర్తించింది. డ్రోన్ల ద్వారా రెండు మృతదేహాలను గుర్తించారు. ఉధంపూర్- కతువా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఎదురుకాల్పులు జరుగుతుండటంతో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద కదలికలు కనిపించడంతో నిన్న సాయంత్రం ఆ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు