14-10-2024 12:03:42 AM
మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. సోషి యో ఫాంటసీ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దసరా సందర్భంగా విశ్వంభర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మిస్టికల్ ల్యాండ్ స్కేప్‌లో చేపల ఆకారంలో ఉన్న పక్షులు ఎగురుతూ, గర్జించే ఖడ్గ మృగాలు, ఎగిరే గుర్రాలను విజువల్ వండర్‌గా చూపిస్తూ టీజర్ ప్రారంభమవుతుంది.
విశ్వంలో అలముకున్న చీకటిని అంతమొందించే లెజెండ్‌గా చిరు కనిపిస్తారు. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. కునాల్ కపూర్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాతలు వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ప్రొడక్షన్ వాల్యూస్ గ్లోబల్ సినిమాని తలపిస్తున్నాయి.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వశిష్ట మాట్లాడుతూ.. “ సినిమా దాదాపు పూర్తుంది. ఒక పాట మాత్రమే మిగిలి ఉంది” అని తెలిపారు. నిర్మాత విక్రమ్ మాట్లాడుతూ.. “విశ్వంభర ఎప్పుడు వస్తే అప్పుడే పండుగ. రామ్ చరణ్ కోసం దిల్ రాజు అడగడంతో విశ్వంభర విడుదల వాయిదా వేశాం” అని తలెఇపారు.