15 July, 2026 | 7:09 AM

టీచర్ల ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రభుత్వమే చేపట్టాలి

26-10-2024 12:31 AM

ప్రధాన ఎన్నికల అధికారికి పీఆర్టీయూ వినతి

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): ఉపాధ్యాయ, గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల ఓటు ఎన్‌రోల్‌మెంట్‌ను ప్రభుత్వమే చేపట్టాలని పీఆర్టీయూ తెలంగాణ నేతలు పర్వత సత్యనారాయణ కోరారు. ఈ మేరకు శుక్ర వారం రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు బాధ్యతను తహశీల్దార్లు, ఆర్డీవోలు,  కలెక్టర్లు, డీఈవోలతోపాటు ఇతర అధికారులతో ప్రభుత్వమే చేపట్టాల ని కోరారు. కార్యక్రమంలో   నాయకులు లింగస్వామి, కే.శ్రీనివాసరావు, శ్రీశైలం, మల్లేశం  పాల్గొన్నారు.