వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి
మంథని ఏఎంసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సంలో ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్ళు చేపట్టాలని ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహా రాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అ న్నారు. సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి., మంథని ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మంథని ఏఎంసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బా బు శాసన సభ్యులు విజయరమణ రావు, ఠాకూర్ మక్కా సింగ్, ఏ ఎంసీ చైర్మన్ కుదుదుల వెంకన్న పలువురు ప్రజాప్రతినిధుల తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగుల సమస్య తలెత్తకుండా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముక్కుల సహేంద ర్ రెడ్డి, టీజీ ఈ ఆర్సీ సలహాదారు శశిభూషణ్ కాచే, ఆర్ టి ఐ మెంబర్ మంథని సురేష్, ఏ ఏం సి వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్,
మాజీ సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, అనంత రెడ్డి, మాజీ ఎంపీపీ కొండ శంకర్, మాజీ ఏ ఎంసీ చైర్మన్ ఆకుల కిరణ్, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ పెండ్లి రమ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి, డీఎం శ్రీకాంత్ , డి సి ఎస్ ఓ, సంఘ అఫిషియల్ పర్సన్ ఇంచార్జి అనిల్ కుమార్, ఏ డి ఏ అంజనీ మిశ్రా, ఏవో నవ్య, ఏఏం సి కార్యదర్శి సతీష్, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఏ ఎంసీ డైరెక్టర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




