ఉప్పర్‌బస్తీలో నిలిచిన రోడ్డు పనులు
14-04-2026 12:49 AM
ఖైరతాబాద్, ఏప్రిల్ 13(విజయక్రాంతి): వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలోని ప్రతాప్ నగర్ ఉప్పర్ బస్తీలో గత మూడు నెలలుగా సాగుతున్న రోడ్డు పనుల జాప్యంపై స్థానిక బస్తీవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బస్తీలో రోడ్డు పనులు మంజూరై నాలుగు గల్లీలలో పూర్తి అయినప్పటికీ ఒక గల్లీలో చివరి లైన్ సమస్య కారణంగా పనులు నిలిచిపోయాయి.
దీనివల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ బస్తీవాసులు రాము, ధనరాజ్, శౌరీరాజ్, ఆనంద్, సాయి కిరణ్ తదితరులు సోమవారం ఎమ్మెల్యే కాలనీలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. గోవర్ధన్ అత్యవసరం గా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.




