7 May, 2026 | 3:13 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

దాయాదుల పోరుకు ప్రవేశం ఉచితం

13-07-2024 12:41 AM
  • మహిళల టీ20 ఆసియా కప్

కొలంబో: మహిళల ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ నెల 19 నుంచి మొదలుకానున్న టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే దాయాదులు తలపడనున్నారు. ‘ఆసియా కప్ టోర్నీలో అన్ని మ్యాచ్ లకు ఉచిత ప్రవేశం కల్పించనున్నాం. మ్యాచ్‌లు కూడా అంతర్జాతీయ చానెళ్లలో ఉచిత లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశాం. ఈ టోర్నీని విజయవం తం చేయాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ భావిస్తోంది.అందుకే ఈ నిర్ణయం’ అని లంక క్రికెట్ బోర్డు చెప్పుకొచ్చింది. గ్రూప్ ఉన్న భార త్.. పాక్‌తో మ్యాచ్ అనంతరం నేపాల్, యూఏఈలతో ఆడనుంది. గ్రూప్ శ్రీలంక, బంగ్లా దేశ్, మలేషియా, థాయ్‌లాండ్‌లు ఉన్నాయి. జూలై 19న ప్రారంభం కానున్న టోర్నీలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి.