అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
పామిడి: అనంతపురం జిల్లాలో(Anantapur district) ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. పొగురురు వంతెనపై హైదరాబాద్ నుంచి బెంగళూరుకు(Hyderabad to Bangalore) వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఐషర్ (Eicher) వాహనం ఢీకొట్టడంతో కనీసం 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
అనంతపురం జిల్లా పామిడి మండలం పోగురూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, రెండు వాహనాలు వంతెన పైనుంచి కింద పడిపోయాయి. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను బస్సులోంచి బయటకు తీసి, చికిత్స కోసం పామిడిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం, క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






