9 August, 2026 | 10:03 AM

కొలనుపాక వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలింపు

09-08-2026 08:31 AM

ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆగస్టు 8న ఆలేరు పోలీస్ స్టేషన్‌కు చెందిన PC-4323 జె. నవీన్, HG-36 జి. వెంకటేష్‌లు కొలనుపాక వాగు పరిసర ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఓ వాహనం ద్వారా వాగు నుంచి ఇసుకను ట్రాలీలో నింపుతున్నట్లు గుర్తించారు. వెంటనే వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా ట్రాలీలో ఇసుక ఉన్నట్లు గుర్తించారు. వాహన డ్రైవర్‌ను విచారించగా కొలనుపాక గ్రామానికి చెందిన మాచర్ల గణేష్ (23)గా గుర్తించారు.

అతను నడుపుతున్న Ashok Leyland వాహనం TS 36 T 6195లో కొలనుపాక వాగు నుంచి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను వెలికితీసి బచ్చన్నపేట వైపు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నందుకు మాచర్ల గణేష్‌పై పోలీసులు చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.