9 August, 2026 | 11:00 AM

హన్మాజీపేట్ గ్రామంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం

09-08-2026 09:51 AM

బాన్సువాడ, ఆగస్టు 9 (విజయ క్రాంతి):కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం లోని హన్మాజీపేట్ గ్రామంలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివాసీలు ఘనంగా ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా గ్రామంలోని కొమరం భీమ్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కామారెడ్డి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొంకి గణేష్ జెండాను ఆవిష్కరణ చేయడం జరిగింది.

అనంతరం అయన మాట్లాడుతూ జల్.. జంగల్.. జామిన్ కోసం ఆదివాసీలు పోరాటం చేయడం ద్వారా నాడు 1992 సంవత్సరాము ప్రపంచ ఐక్య రాజ్య సమితి ఆదివాసీలకు ఒక్క గుర్తింపు ఇవ్వడం జరిగిందనీ అదే డిసెంబర్  09 దీనిని ప్రపంచ ఆదివాసీ దినోత్సవము జరుపుకుంటాము అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య వెంకగౌడ్. ఏర్రవట్టి సాయిబాబా. ఉప సర్పచ్ బాబ్యా నాయక్. సంజీవ్.వార్డ్ మెంబర్లు కొంకి సుశీల.బాల్ రాజు తుకారాం.బాగయ్యా.  ఆదివాసీ నాయకపోడు గ్రామ అద్యక్షులు శంకర్. పెంకటి గణేశ్.సుభాష్.గంగాధర్.సాయిలు.కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.