పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
23-08-2024 05:41 PM
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమేష్
కుమ్రం భీం ఆసిఫాబాద్ ( విజయ క్రాంతి): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమేష్ అన్నారు. శుక్రవారం కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్ జ్ యువ రాజా, జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి ప్రతి వనం మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో భావితరాలకు సమతుల్యమైన వాతావరణాన్ని సమకూర్చిన వాళ్ళం అవుతామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటి దాని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవీందర్, సీనియర్ న్యాయవాదులు తాటిపల్లి సురేష్, ముక్తా సురేష్, చందర్ కుమార్, బోనగిరి సతీష్ బాబు, రజ హైదర్ తదితరులు పాల్గొన్నారు.






