హరితహారంలో రవాణా శాఖ భాగస్వామ్యం
వనపర్తి టౌన్ , ఆగస్టు 27: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రవాణా శాఖ అధికారి జె. సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం, డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ తదితర అనుకూల ప్రదేశాల్లో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో చెట్ల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించడమే కార్యక్రమం లక్ష్యమని అధికారులు తెలిపారు.
రవాణా శాఖ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించారు. వాహనాల వల్ల ఏర్పడే కాలుష్యాన్ని తగ్గించడంలో పచ్చదనం కీలకమని, “హరిత రవాణా – హరిత తెలంగాణ” స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎం. శ్రీకాంత్ (ఏఎంవీఐ), జె. సైదులు (ఏఎంవీఐ), కానిస్టేబుల్ సంతోష్‌కుమార్, హోంగార్డు తదితరులు పాల్గొన్నారు.






