21 July, 2026 | 8:17 PM

Breaking News

హలో బీసీ.. చలో బెంగళూరు   •   చిట్యాలలో కోతులు, వీధికుక్కల సమస్యపై బీఆర్ఎస్ ధర్నా   •   రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి   •   సర్ ప్రక్రియను పరిశీలించిన టీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా సంజీవ్ నాయక్   •   విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని ఎమ్మార్వోకు రైతుల వినతి   •   అక్రమ ఇసుక నిల్వలు సీజ్   •   రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి   •   బిజెపి పోరాటం వల్లే హౌసింగ్ బోర్డు రోడ్డుకు నిధులు   •   పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత   •   ప్రజలకు కనీస వసతులు కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం   •  

వికారాబాద్‌లో ఎన్సీసీ యూనిట్ ఏర్పాటు చేయండి

18-03-2025 12:46 AM

కేంద్ర మంత్రి సంజయ్ ని కోరిన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి 

చేవెళ్ల, మార్చి 17: వికారాబాద్ లో ఎన్సీసీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోరారు.  సోమవారం న్యూఢిల్లీ సౌత్ బ్లాక్ లో ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎన్సీసీ యూనిట్ తో తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్, చేవెళ్ల నియోజకవర్గ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

దేశభక్తి పెంపొందడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ మేరకు జూలై నెల 2024 లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. వికారాబాద్ మునిసిపల్ పరిధిలో అనంత పద్మనాభ స్వామి కళాశాల  భవనం లో ఈ యూనిట్ ఏర్పాటు చేయడానికి కళాశాల యాజమాన్యం కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. అంతేకాదు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కు లేఖ రాసిందని తెలిపారు. దీంతో కేంద్ర రక్షణ శాఖ సహాయ  సానుకూలంగా స్పందించారు.