21 July, 2026 | 10:09 PM

Breaking News

రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

21-07-2026 08:01 PM

రహదారులను పరిశీలించిన ఎమ్మెల్యే

– రూ.200 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణం

బోధన్,(విజయక్రాంతి): వర్షాభావ పరిస్థితులు, మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు లాభసాటి ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. మంగళవారం బోధన్ నియోజకవర్గంలోని ఫకిరాబాద్ నుంచి ఆచన్‌పల్లి వరకు రూ.18 కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్ రోడ్డును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ పాఠశాల ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.