21 July, 2026 | 9:35 PM

Breaking News

ప్రజలకు కనీస వసతులు కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం

21-07-2026 07:54 PM

బిజెపి నాయకులు జాకట ప్రేమ్ దాస్

మేడ్చల్ అర్బన్(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వసతులను కల్పించలేని దుస్థితిలో నెలకొందని బిజెపి సీనియర్ నాయకులు జాకట్ట ప్రేమ్ దాస్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లపాటు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ప్రేమ్ దాస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరిగి రోడ్లపైకి వచ్చి నిరసనల పేరుతో రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేస్తుందని ఆరోపిస్తూ ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకత లేదు,గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన త్రాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వసతులు కల్పించడం లేదు, అభివృద్ధి పనుల కంటే ప్రచారానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తుంది. చివరగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సంక్షేమంగా వినియోగించుకోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని జాకట ప్రేమ్ దాస్ మండిపడ్డారు.