11 June, 2026 | 3:11 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

11-06-2026 02:27 AM

ఎస్పీ నితికా పంత్

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ నితికా పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బుధవారం అరైవ్ అలై వ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఎస్పీ మాట్లాడుతూ యువత ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, నాలుగు చక్రాల వాహనాల్లో సీటుబెల్ట్ వినియోగించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. త్రిబుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం, రాంగ్సైడ్లో ప్రయాణించడం వంటి నిర్లక్ష్య చర్యల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు. అనంతరం జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన దృశ్యాలను విద్యార్థులకు ప్రదర్శించి అవగాహన కల్పించారు.అధికారులు, విద్యార్థులు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చిత్తరంజన్, డీఎస్పీ అశోక్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రియదర్శిని, ఇన్స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీష్, విద్యార్థులు పాల్గొన్నారు.