11 June, 2026 | 3:18 AM

కబ్జాకు గురైన పార్క్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

11-06-2026 02:28 AM

కబ్జాదారుల నుంచి పార్క్‌ను కాపాడాలంటూ కమిషనర్‌కు ఫిర్యాదు

కూకట్ పల్లి, జూన్ 10 (విజయక్రాంతి): కూకట్పల్లి డివిజన్ పరిధిలోని శిల్ప ఎవె న్యూ కాలనీలో కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారా వు  బుధవారం పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వహయాంలో పార్కుల పరిరక్షణలో భాగంగా కూకట్పల్లిలోని పార్కులకు జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో పార్కులు కబ్జాకు గురి కాకుండాప్రహరీ గోడలు నిర్మించామన్నారు.

శిల్ప రెవెన్యూ కాలనీలో పార్కుకు నిర్మించిన ప్రహరీ గోడను కొందరు కబ్జాదారులు కూల్చివేసి కంటైనర్ ఏర్పాటు చేసుకొని పార్కు స్థలాన్ని దర్జాగా కబ్జా చేసిన అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల విలువైన  మున్సిపల్ పార్కు స్థలాలు కబ్జాకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా మున్సిపల్, పోలీస్ అధికారులు కబ్జాదారుల పట్ల  కఠినంగా వ్యవహరించి వారి ఆగడాలను ఆరికట్టాలని ఆదేశించారు. కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని పరిశీలిస్తున్న సమయంలో అక్కడ ఉన్న కొందరు కబ్జాదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కృష్ణారావు

 కూకట్పల్లి నియోజకవర్గ పరిధి శిల్ప ఎవెన్యూ కాలనీ లో పార్కును కొందరు భూకబ్జాదారులు కబ్జా చేస్తున్నారని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనకు కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఫిర్యాదు చేశారు. పార్కు ను కబ్జాదారుల నుండి కాపాడాలని కమిషనర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, బి ఆర్ ఎస్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు సాయి శ్రీనివాస్, రాజేష్,భారతి తదితరులు పాల్గొన్నారు.